అడవిలో ఎండకు తాళలేక నీటి కుంట వద్దకు వచ్చిన ఏనుగు- భయభ్రాంతులకు గురైన గ్రామస్థులు - elephant relaxed in pond - ELEPHANT RELAXED IN POND
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 4:19 PM IST
Elephant Relaxed in Pond: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాలువపల్లె వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. వేసవి తాపానికి రోడ్డు పక్కనే ఉన్న చెరువులో కాసేపు సేద తీరింది. ఒంటరి ఏనుగును చూసి చుట్టుపక్క గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అడవిలో ఆహారం, నీరు దొరకకపోవడంతో గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నట్లు జంతు ప్రేమికులు చెబుతున్నారు. గ్రామ శివారు పొలాల వద్ద పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా ఓ ఏనుగు చిత్తూరు జిల్లాలో సంచరిస్తోంది. కొద్ది రోజుల క్రితం సైతం పలమనేరు మండలం ముసలిమడుగు సమీపప్రాంతాల్లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఓ రైతు పొలంలోకి చొరబడి అక్కడి రేకుల షెడ్డును ధ్వంసం చేసింది. అంతేగాక అందులో ఉన్న పశువుల దానా, పక్కనే ఉన్న వరి పంట, అరటి తోటలను సైతం గజరాజు నాశనం చేసింది. దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకుని ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.