ఎన్నికల వేళ మద్యం విక్రయాలపై నిబంధనలు - Focus on Liquor Sales - FOCUS ON LIQUOR SALES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 11:00 AM IST

Election Regulations on Liquor in Anantapur District : ఎన్నికల సంఘం మద్యం విక్రయాలపై నిబంధనలను వర్తింపచేసింది. అధికారుల వివరాల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 167 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో భాగంగా అబ్కారీ అధికారులు గత ఏడాది ఇదే సమయానికి అమ్ముడుపోయిన మద్యం వివరాల ఆధారంగా కొన్ని దుకాణాలకు లక్ష్యాన్ని తగ్గించారు. రెండు రోజులుగా ఈ నిబంధనలను వర్తింప చేస్తున్నారు. ఒక్కో దుకాణంపై సగటున రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు మద్యం అమ్మకాలు తగ్గించారు. పలు చోట్ల నిర్దేశించిన లక్ష్యం సాయంత్రం లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే దుకాణాన్ని బంద్ చేయాల్సి వస్తోంది. 

ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు అందోళనకు దిగే అవకాశం ఉందన్న ఆలోచనతో నిర్దేశిత సమయం వరకు దుకాణాలు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక వ్యక్తికి ఒకటి లేదా రెండు మద్యం సీసాలు విక్రయించేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా ఎన్నికల సంఘం జాగ్రత్త పడుతుంది. ఒకవేళ రాజకీయ పార్టీలు ఎక్కువ మద్యం కొనడానికి ప్రయత్నించినా దానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.