వైసీపీ ఫ్లెక్సీలు, జండాలు తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం - Election code violations
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 9:55 AM IST
Election code violations: ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తూ అధికారులు స్వామి భక్తిని చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రి బస్సు యాత్ర పూర్తైనప్పటికీ కనిగిరి ప్రధాన రహదారిలో వెంబడి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జండాలను ఏ అధికారి తొలగించిన దాఖలాలైతే కనిపించట్లేదు. దీన్నిబట్టి ఎన్నికల కోడ్ నియమ నిబంధనలను స్థానిక అధికారులు ఎంత పకడ్బంధీగా అమలు పరుస్తున్నారో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి బస్సు యాత్ర నిమిత్తం ఆ పార్టీ కార్యకర్తలు కనిగిరి పట్టణంలోని పలు ప్రాంతాలలో ఫ్లెక్సీలను జండాలను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ బస్సు యాత్ర ముగిసినప్పటికీ ఫ్లెక్సీల తొలగింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
జనసంచారం లేని ప్రాంతాలలో మాత్రం ఫ్లెక్సీలను జండాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించిన అధికారులు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫ్లెక్సీలపై కన్నెతైనా చూడటం లేదు. ఆర్టీసీ డిపో ఎదురుగా, జూనియర్ కాలేజీ ఎదురుగా, పోస్ట్ ఆఫీస్ కి వెళ్లే మార్గంలో జండాలను ప్లెక్సీలను అలానే ఉంచారు. దీన్ని బట్టి స్థానిక అధికారులు జగన్ రెడ్డి భక్తిని ఎంత భక్తిగా చాటుకుంటున్నారో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి కనిగిరి పట్టణంలో బస్సు యాత్ర నిమిత్తం ఏర్పాటుచేసిన వైసీపీ జెండాలను ప్లెక్సీలను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నికల నియమ నిబంధనలను తూచా తప్పకుండా స్థానిక అధికారులు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.