'కోడ్' కూసినా మేల్కొని అధికారులు- కనిగిరి ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ స్టిక్కర్లు - Authorities Not Execute Code
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 3:03 PM IST
Election Code is Execution Authorities Not Taken Action in Kanigiri: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా కనిగిరిలో మాత్రం అధికారులు చర్యలు చేపట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసినప్పటికీ విగ్రహాల కింద భాగాన ఉన్న ప్లాట్ పామ్‌లకు, దిమ్మెలకు వైసీపీ రంగులు తొలగించలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో (Government Offices) జగన్ బొమ్మలతో ఉన్న స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. వాటిని అధికారులు తొలగించనేలేదు. మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న శిలాఫలకాలపై వైసీపీ నేతల పేర్లు అలాగే కనిపించేలా ఉంచారు.
వైఎస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌కు ఉన్న లోగోలకు సైతం పార్టీ గుర్తులు లేకుండా స్టిక్కర్లు అంటించలేదు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వైసీపీ రంగులతో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలా దర్శనమిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ఉన్న ప్రతి ఇంటికి జగన్ బొమ్మతో అంటించి ఉన్న స్టిక్కర్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ నియమావళిని పూర్తిగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.