భాషలో నియంతృత్వం కాదు - సరళత్వం కావాలి : డీఎన్ ప్రసాద్ - Enadu Editor Dn book release - ENADU EDITOR DN BOOK RELEASE
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2024, 12:01 PM IST
Trending Poems Book Launch : భాషలో నియంతృత్వం పనికి రాదు, సరళత్వం కావాలని ఈనాడు తెలంగాణ ప్రధాన సంపాదకులు డి.ఎన్.ప్రసాద్ అన్నారు. ఇతర భాషల్లోని పదాలను సైతం మన మాతృ భాషలో చేర్చుకోవడానికి ఇబ్బంది పడకూడదని, అలాగని అన్ని పదాలను కాకుండా కొన్ని మాత్రమే అని సూచించారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రివ్యూ థియేటర్లో పద్య సారస్వత పీఠం తెలంగాణ ఆధ్వర్యంలో అఖిల భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భాషలో సరళత్వం కావాలి : తమ పత్రికలో ఎక్కడైనా ఆంగ్ల పదం దొర్లితే, తమ ఛైర్మన్ రామోజీరావు వాటిని వెంటనే గుర్తించి తెలుగు చేయించేవారని తెలిపారు. ఉపయోగించదగ్గవి అయితే కచ్చితంగా అమలులో పెట్టేవారని ఈనాడు పాఠకులైన సాహితీవేత్తలు ఆంగ్ల పదాలకు సమానార్థం వచ్చే తెలుగు పదాలు కనుగొంటే తమకు పంపించాలన్నారు. ఆంగ్ల పదం లేని తెలుగు పత్రిక ఇచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. తద్వారా తెలుగు భాషను పరిపుష్టం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
నూతన సాంకేతికతను పుణకిపుచ్చుకోవాలి: సరిహద్దులు దాటిపోయిన చదువు, జీవితంలో ఎక్కడో ఒకచోట ముఖ్యంగా ఉపాధిలో ఉపయోగపడాలన్నారు. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయనీ, వాటిని అందుకునే ప్రయత్నంలో ఈతరం పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి కూడా ఉందన్నారు. నిరంతరమైన మార్పును జీవితంలో ఇముడ్చుకోవాలనీ వృత్తి ఏదైనా దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ ముందడుగు వేసినప్పుడే జీవితం ప్రవాహంలా సాగుతుందన్నారు.