వైభవంగా మల్లేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు: నేటి నుంచి దర్శనాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 12:33 PM IST
Durga Malleswara Swamy Temple Inauguration By Minister Kottu Satyanarayana: విజయవాడ ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై కొలువైన మల్లేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ధ్వజస్తంభ సహిత స్వర్ణశిఖర కుంభాభిషేక వేడుక నేత్రపర్వంగా సాగింది. దేవాదాయశాఖ మంత్రి (Endowment Minister) కొట్టు సత్యనారాయణ దంపతులు ధ్వజస్తంభ ప్రతిష్ఠ, స్వర్ణశిఖర కుంభాభిషేక ఉత్సవంలో పాల్గొన్నారు. పాంచాహ్నిక దీక్ష స్వీకరించిన అర్చకులు ఐదు రోజుల పాటు స్వర్ణ శిఖరం, ధ్వజస్తంభ, జన, ధాన్య, పుష్ప, ఫల, ధాతు, బీజ, రత్నాన్యాసాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
దాతలు, ప్రభుత్వ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. నేటి నుంచి శివాలయంలో భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. విగ్రహ స్థాపన, కళాన్యాసం, కల్యాణోత్సవాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాదశర్మ, ట్రస్టు బోర్డు చైర్మన్ రాంబాబు, ఏఈవోలు, వైదిక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.