కావలిలో డ్రగ్స్ ముఠా అరెస్ట్, అంతా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులే - కావలిలో డ్రగ్స్ ముఠా అరెస్ట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 1:33 PM IST
Drugs Mafia Busted In Kavali Nellore District : నెల్లూరు జిల్లా కావలిలో యువతను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ (Drugs) సరఫరా చేస్తున్న ముఠాను కావలి పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఇందిరానగర్లో సీఐ రాజేష్ నిర్వహించిన దాడుల్లో ఒడిశాకు చెందిన వ్యక్తిని, అతని ఇంట్లోని గంజాయి ప్యాకెట్లు, మత్తుమందులను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ ముఠాలోని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు (Police) తెలిపారు.
Drugs Gang Arrest in Nellor District : గంజాయి (Ganjai) సహా పలు హానికరమైన మందులు వీరి వద్ద లభిచాయమని పోలీసులు తెలిపారు. నిందితులను విచారించగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని పోలీసులు వెల్లడించారు. వీరంతా డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులుగా గుర్తించారు. ఈ సందర్ఙంగా సీఐ రాజేష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు. పిల్లల నడవడికలు తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన సీఎ రాజేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.