రేపల్లెలో తాగునీటి ఎద్దడి - రహదారికి అడ్డంగా నీటిడ్రమ్ములు పెట్టి ఆందోళన - drinking water problem - DRINKING WATER PROBLEM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 12:36 PM IST
Drinking Water Problem in Repalle Bapatla District : బాపట్ల జిల్లాలో తాగునీరు రావడం లేదని స్థానికులు రోడ్డెక్కారు. రేపల్లె పట్టణంలోని 28వ వార్డులో సుమారు మూడు నెలలు తాగు నీరు రావడం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన రహదారిపై ఖాళీ డ్రమ్ములను అడ్డుగా పెట్టి నిరసన తెలిపారు. తమకు తాగునీరు రావడం లేదని అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా మోటార్లు రిపేర్ అని చెప్పి మాట దాటేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి పన్ను సమయానికి వసూలు చేసే అధికారులు ప్రజల సమస్యలను తీర్చడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరు సరిపోక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం పనులకు వెళ్లకుండా గంటల తరబడి ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. తమ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని రేపల్లె మున్సిపల్ కమిషనర్ వచ్చి చెప్పడంతో స్థానికులు తమ ఆందోళన విరమించారు.