ఇదోరకం ఫ్యాషన్- డిస్పోజబుల్ డ్రెస్ పోటీలు - Disposable Dress Competitions - DISPOSABLE DRESS COMPETITIONS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-07-2024/640-480-22085142-thumbnail-16x9-disposable-dress-competitions.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 7:12 PM IST
Disposable Dress Competitions: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వాసవి మహిళా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్పోజబుల్ డ్రెస్ పోటీలు ఆద్యంతం అలరించాయి. తణుకులో మెగా కిట్టి పార్టీ నిర్వహించారు. సుమారు వెయ్యి మంది వాసవి మహిళలు పాల్గొన్నారు. కిట్టి పార్టీలో భాగంగా డిస్పోజబుల్ డ్రెస్ పోటీలు నిర్వహించారు. మహిళలు తాము ధరించిన డ్రెస్సులపై డిస్పోజబుల్ వస్తువులను అంటించుకుని పోటీలో పాల్గొన్నారు. డిస్పోజబుల్ టీ గ్లాసులు, కప్పులు, ప్లేటులు, ఇతర డిస్పోజబుల్ వస్తువులను చీరలు, డ్రెస్సులపై అంటించుకుని అలరించారు.
సుమారు వందమంది ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మెగా కిట్టీ పార్టీ నిర్వహించడం, అందులో భాగంగా వినూత్నంగా పోటీలు నిర్వహించడం జరుగుతోంది. గత సంవత్సరం పేపర్ డ్రెస్సులతో పోటీలు నిర్వహించి ఆకట్టుకున్న వాసవి మహిళలు, ఈ సంవత్సరం మరో వినూత్న పోటీలను నిర్వహించారు. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా డిస్పోజబుల్ ఐటమ్స్‌తో డ్రెస్ తయారు చేసి, వినూత్న ఆలోచనతో పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. డిస్పోజబుల్ డ్రెస్ పోటీలతో పాటు హౌసీ, ప్రతి గంటకు లక్కీ డిప్ పోటీలు సైతం నిర్వహించామని వివరించారు.