వైసీపీలో భగ్గుమన్న విభేదాలు - అధిష్టానానికి తలనొప్పిగా మారిన ఆమంచి - Differences between YCP leaders - DIFFERENCES BETWEEN YCP LEADERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 11:27 AM IST

Updated : Mar 29, 2024, 11:53 AM IST

Differences Between YCP Leaders in Chirala Constituency: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా కరణం వెంకటేష్​కు (Chirala YCP MLA candidate Karanam Venkatesh) వైసీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో ఆయన ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోవైపు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Former MLA Amanchi Krishna Mohan) నియోజకవర్గంలో రాత్రింబవళ్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

చీరాల వైసీపీ టికెట్ స్థానికులకే కేటాయించాలనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. చీరాల టికెట్టు స్థానికులకే ఇవ్వాలని ఈ క్రమంలో వెంకటేష్​కు మద్దతు తెలిపేది లేదని తేల్చి చెప్పారు. పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా (Parchur Constituency YCP Incharge) ఉన్న కృష్ణమోహన్​ను తప్పించి యడం బాలాజీకి వైసీపీ అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమంచి తిరిగి చీరాల నియోజకవర్గంలో ప్రతిరోజూ సమావేశాలు నిర్వహిస్తుండటం అధికార వైసీపీకి తలనొప్పిగా మారింది.

Last Updated : Mar 29, 2024, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.