అయోధ్య బాల రాముడి కోసం కిలో బంగారం, 13 కిలోల వెండితో ధనుర్బాణం - చూసి మీరూ తరించండి - Ayodhya Rams Dhanurbanas - AYODHYA RAMS DHANURBANAS
🎬 Watch Now: Feature Video
Published : Aug 1, 2024, 8:55 PM IST
Ayodhya Rams Dhanurbanas To Shadnagar : అయోధ్య రామమందిరంలో ప్రతిష్టించబోతున్న శ్రీరామ చంద్రుడి చేతిలో ఉండాల్సిన ధనుర్బాణాలు గురువారం షాద్‌నగర్ ఆలయానికి తీసుకొచ్చారు. హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాసశాస్త్రి అనే వ్యక్తి అయోధ్య బాల రాముని మందిరం పైన నిర్మించే శ్రీరాముని విగ్రహానికి ధనస్సు బాణం ఇవ్వాలని సంకల్పించుకున్నారు. దీనికోసం 13 కిలోల వెండి, ఒక కిలో బంగారంతో హైదరాబాద్లో ధనుస్సు బాణం తయారు చేయించారు. మందిరం పూర్తి కావడానికి సమయం ఉండటంతో తాను తయారు చేయించిన ధనస్సును భక్తుల సందర్శనార్థం ప్రముఖ ఆలయాల్లో ప్రదర్శన నిమిత్తం తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.
దీంట్లో భాగంగా గురువారం షాద్‌నగర్ పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి శ్రీరామచంద్రుని ధనుర్భాణాలు తీసుకువచ్చారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు రంగనాథ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. షాద్‌నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు వీటిని భక్తుల సందర్శనార్థం తీసుకెళ్తున్నట్లు శ్రీనివాసశాస్త్రి చెప్పారు.