టీడీపీ- జనసేన గెలుపునకు అందరం కలిసి పని చేస్తాం: దేవినేని ఉమా - టీడీపీ గెలుపుకు కృషి చేస్తామన్న ఉమా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 3, 2024, 9:29 PM IST
Devineni Uma Say Work For Victory of TDP in Elections: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం గెలుపు కోసం కలిసి పని చేస్తామంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావులు ప్రకటించారు. చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగళం యాత్రతో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం ఖాయమని నేతలు హెచ్చరించారు. "బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చిన శంఖారావం కార్యక్రమం, 6వ తేదిన జరగనున్న చంద్రబాబు ప్రజాగళం యాత్రను జయప్రదం చేస్తామని వెల్లడించారు.
సోమవారం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొంటామని ఉమా చెప్పారు. అప్రజాస్వామిక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా పనిచేస్తామని ఉమా స్పష్టం చేశారు. ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలతో పాటు మినీ మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని విమర్శించారు. తెలుగుదేశం- జనసేన అధికారంలోకి రావడానికి కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు.