నాలుగున్నర ఏళ్లలో జగన్ రెడ్డి అరాచక పాలనే రాజధాని ఫైల్స్ సినిమా: దేవినేని ఉమా - Devineni Uma about rajadhani files
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 5:11 PM IST
Devineni Uma about Rajadhani Files Movie: నాలుగున్నర సంవత్సర కాలంలో జగన్ రెడ్డి పాలనను రాజధాని ఫైల్స్ ద్వారా అద్దం పట్టినట్టు చూపించారని దేవినేని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల (Amaravati Farmers) అవస్థల నేపథ్యంగా తెరకెక్కించిన రాజధాని ఫైల్స్ (Rajadhani Files) సినిమాను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ కార్యకర్తలతో కలిసి ఈరోజు వీక్షించారు. ఖండాంతర వ్యాప్తంగా రాజధాని ఫైల్స్ సినిమా చూసి జగన్మోహన్ రెడ్డి అక్రమాలను ప్రతి పౌరుడు తెలుసుకోవాలని దేవినేని పిలుపునిచ్చారు.
Devineni Fires on YSRCP Government: ప్రజలను చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలను రాజధాని ఫైల్స్ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించారని రాజధాని సినిమా బృందాన్ని దేవినేని అభినందించారు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రానికి, ప్రజలకు చేసిన అన్యాయాన్ని, ల్యాండ్, ఇసుకలో లక్షల కోట్ల దోపిడీ గురించి చక్కగా దర్శకుడు చిత్రించారని దేవినేని కొనియాడారు. జగన్ పాలనలో పత్రికా స్వేచ్ఛ హరించేలా వ్యవహరిస్తూ, ఎదురు తిరిగినవారిపై దాడికి పాల్పడుతున్నారని ఉమా మండిపడ్డారు.