జగన్నాటకంలో ఫించన్దారులకు ఇబ్బందులు: దేవినేని ఉమా - TDP leader Devineni Uma - TDP LEADER DEVINENI UMA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 27, 2024, 4:54 PM IST
TDP leader Devineni Uma: జూన్ 1వ తేదీ వస్తున్నందున అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడాలని మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. జగన్నాటకంలో భాగంగా గత రెండునెలలు ఫించన్ దారుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. ఏప్రిల్, మే నెలలో జగన్ నేతృత్వంలో జరిగిన దుర్మార్గపు కుట్రలో సీఎస్, సెర్ఫ్ సీఈవో కలిసి పదుల సంఖ్యలో వృద్ధుల మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు. ఎన్నికలైపోవటంతో పాటు జగన్ రెడ్డి పని కూడా అయిపోయినందున, ఇప్పుడైనా సచివాలయ సిబ్బంది సాయంతో ఫించన్లు ఇంటివద్ద అందచేయాలన్నారు. ఇళ్ల వద్ద ఫించన్లు అందించకుండా జరిగిన కుట్రపై సమీక్షించి, అధికారంలోకి రాగానే అందరిపైనా చర్యలు తీసుకుంటామని ఉమ వెల్లడించారు. ఏప్రిల్, మే నెలల్లో పదుల సంఖ్యలో వృద్ధుల చావుకు కారకులైన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నెలాఖరుకల్లా సచివాలయాలకు డబ్బు వెళ్లి, జూన్ 1వ తేదీన ఇళ్ల వద్ద ఫించన్ అందించే బాధ్యత తీసుకోకుంటే అందుకు బాధ్యులంతా శిక్షింపబడతారని దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.