LIVE : ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం - BHATTI VIKRAMARKA LIVE IN KHAMMAM - BHATTI VIKRAMARKA LIVE IN KHAMMAM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-06-2024/640-480-21753537-thumbnail-16x9-kmm-bhatti1.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jun 20, 2024, 3:16 PM IST
|Updated : Jun 20, 2024, 3:37 PM IST
Bhatti Vikramarka Live From Khammam Today : ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క బొగ్గు గనుల వేలం ప్రక్రియ గురించి మాట్లాడారు. బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రం ప్రారంభిస్తుందని భట్టి తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. సింగరేణి తెలంగాణకే తలమానికమని చెప్పారు. సింగరేణిలో 42 వేల మంది రెగ్యులర్, 6 వేలమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. 2030 కల్లా 15 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Last Updated : Jun 20, 2024, 3:37 PM IST