'పారిశుద్ధ్య కార్మికులకు వేతన పెంపు సహా వారాంతపు సెలవులు మంజూరు చేయాలి' - Municipal Workers demands
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-02-2024/640-480-20664726-thumbnail-16x9-demands-of-safai-karmachari-sangam.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 3:52 PM IST
Demands of Safai Karmachari Sangam in Vijayawada : పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని ప్రోగ్రెసివ్ సఫాయి కర్మచారి సంఘం డిమాండ్ చేసింది. వేతనంతో పాటు E.S.I, P.F సౌకర్యాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా కార్మికులకు నాణ్యమైన పనిముట్లు అందించాలన్నారు. ఆదివారం విజయవాడలో సంఘ ముఖ్య నేతలతో కలిసి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనశేఖర్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులకు వారాంతపు సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. అయితే ప్రస్తుతం ఈ డిమాండ్ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తమకు సమాచారం ఉందని తెలిపారు.
అలాగే ప్రస్తుతం కార్మికులకు ఇస్తున్న రూ .21 వేల జీతాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు లీడ్ బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్తో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రతి మున్సిపాలిటిలో ఉన్న కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించాని కోరారు.