ఏజెన్సీ ప్రాంత మాదిగలను వాల్మీకులుగా గుర్తించాలి- ఇన్​ఫామ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆందోళన - Madiga community

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 10:08 PM IST

Updated : Feb 6, 2024, 10:59 PM IST

Demands of Madiga Community in Alluri Sitharama Raju District : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న రెండు లక్షల మంది మాదిగలను వాల్మీకులుగా గుర్తించాలని పెద్దఎత్తున మాదిగలు ఆందోళనలు చేశారు. ఇన్​ఫామ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డప్పులు మోగిస్తూ, నినాదాలు చేస్తూ భారీ ర్యాలీగా వచ్చి కలెక్టరేట్​ను ముట్టడించారు. జిల్లాలోని అరకులోయ, పాడేరు, రంపచోడవరంలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న లక్షలాది మాదిగలకు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని వారు మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతమనే భేదలు లేకుండా అందరికి సమానంగా ఇళ్లు ఇస్తానన్నా జగన్ ఏజెన్సీలలో ఉన్న మాదిగలకు మాత్రం ఏందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. 

ఇప్పటకీ ఏజెన్సీ ప్రాంతంలోని మాదిగలకు ఇళ్లు లేవని వాపోయారు. 75 సంవత్సరాలుగా అంతరాని తనంతో ఏజెన్సీలో మాదిగలు దుర్భర జీవితం అనుభవిస్తుంటే ప్రభుత్వనికి పట్టాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలకు సైతం తమ బాధలు వినిపించటం లేదని వాపోయారు. ఇప్పటికైన ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేదంటే మరో సారి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Last Updated : Feb 6, 2024, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.