రామాయణం విశ్వ సందేశం - ఘనంగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం - Ayodhya prana prathishtha
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 10:16 PM IST
Debate on Ayodhya Ram Mandir : జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవి అని శ్రీరాముడు అంటారు. ఆ జగదేకపతిని కన్న జన్మభూమి మరేదో కాదు అయోధ్య అనే సుందర సుసంపన్న ప్రదేశం. నాటి త్రేతాయుగం నుంచి నేటి కలియుగం వరకు ఆ అయోధ్య అశేష జనవాహినికి పుణ్యస్థలం. తాను అవతరించినందుకే కాదు, అసమాన శౌర్య ప్రతాపాలు, ఆధ్యాత్మిక అనుభూతులకు ఆలవాలమైనందుకే రామయ్యకు ఆ ప్రాంతమంటే అంత ప్రీతి.
Facts About Ayodhya Ram Mandir : రఘురాముడికి ప్రాణప్రదమైన అయోధ్యలో, ఆ దాశరథి జన్మభూమిలో నిర్మించిన మందిరంలో జరిగిన ప్రాణప్రతిష్ఠ అద్భుతం, అపురూపం. శ్రీరాముడు అంటే ఆజానుబాహుడు, కోదండాన్ని ధరించిన కోదండరాముడే గుర్తుకు వస్తాడు కదా. కానీ అయోధ్యలో బాలరాముడినే ప్రతిష్టించటానికి కారణాలు ఏంటి? దశావతారాల్లో రామావతారం ప్రత్యేకత ఏంటి? మిగతా అవతారాలతో పోలిస్తే శ్రీరాముడినే ఈరోజుకీ అందరూ ఆదర్శంగా చెబుతారు. దానికి కారణం ఏంటి? ఈ నేపథ్యంలో ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.