ఇంద్రకీలాద్రి శోభాయమానం - మరికొద్ది గంటల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం - Dasara Arrangements Indrakeeladri - DASARA ARRANGEMENTS INDRAKEELADRI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2024, 7:56 PM IST
Dasara Arrangements in Vijayawada Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా శోభను సంతరించుకుంటోంది. నవరాత్రి ఉత్సవాలు దగ్గరపడుతున్న తరుణంలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంతో పాటు వివిధ శాఖల యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు మొదలు కావడానికి కొద్దిరోజులే సమయం ఉండడంతో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న ఘాట్‌రోడ్డు వద్ద చేపడుతోన్న రక్షణ గోడ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కెనాల్ రోడ్డు వినాయకగుడి నుంచి దుర్గగుడి టోల్‌గేట్ వరకు క్యూలైన్ల నిర్మాణం పూర్తయింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అంచనా వేసుకుని అందుకు తగిన సంఖ్యలో లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. ఘాట్‌రోడ్డు మార్గంలో దర్శనం చేసుకున్న భక్తులు మల్లేశ్వరాలయ మెట్ల ద్వారా, మల్లికార్జున మహామండపం ర్యాంపు ద్వారా బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
గతంలో అత్యవసర సమయంలో మాత్రమే ఈ మార్గాన్ని వినియోగించేవారు. సామాన్య భక్తుల రద్దీ, వారికి కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నవరాత్రుల వేళ ఎప్పుడుపడితే అప్పుడు వీవీఐపీలు రాకుండా సమయాన్ని నిర్దేశించారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్‌తో మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ ముఖాముఖి.