జగన్ బినామీ కంపెనీలు ఇసుక తవ్వకాలతో రూ.60వేల కోట్లు దోచేశాయి: దండా నాగేంద్ర - Danda Nagendra on SC Guidelines - DANDA NAGENDRA ON SC GUIDELINES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 17, 2024, 6:07 PM IST
Danda Nagendra on Supreme Guidelines on Sand Mining: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రింకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయాలని పిటిషనర్ దండా నాగేంద్ర డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలు ఐదేళ్లుగా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరిపి 60 వేల కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నాయని ఆయన ఆరోపించారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదని జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల్ని సుప్రింకోర్టు విశ్వసించలేదని కేవలం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ బృందం సాంకేతిక అంశాలు, శాస్త్రీయ ఆధారాలతో ఇచ్చిన నివేదకను మాత్రమే పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకూ తన పోరాటం కొనసాగుతుందని దండా నాగేంద్ర అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ ఇసుక తవ్వకాలు సాగడం లేదని, నిబంధనల ఉల్లంఘనలు జరగడంలేదని తప్పుడు నివేదికలతో సుప్రీంకోర్టు కళ్లకు గంతలు కట్టాలని జగన్ ప్రభుత్వం, గనులశాఖ ప్రయత్నించినా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం అక్రమ తవ్వకాలు నిజమేనని స్పష్టం చేసిందని తెలిపారు.