బైక్ అడ్డంగా పెట్టావంటూ దళిత యువకుడిపై వైసీపీ వర్గీయులు దాడి - YCP Leaders Attack - YCP LEADERS ATTACK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 10:47 AM IST
Dalit Youth Attacked by YCP Leaders in Nadyala District : శ్రీశైలంలో ఓ దళిత యువకుడిపై ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిపై పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సంఘటనపై బాధితుడు శీలం ప్రసన్నకుమార్ బుధవారం శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులపై బైండోవర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీశైలానికి చెందిన శీలం ప్రసన్నకుమార్ మంగళవారం రాత్రి ఒక దుకాణం వద్ద టిఫిన్ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ద్వి చక్ర వాహనం అడ్డుగా ఉందని సుబ్బయ్య అనే యువకుడు ప్రసన్నకుమార్‌తో గొడవ పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని సుబ్బయ్య వైసీపీ మద్ధతుదారుడైన చంద్రశేఖర్ అనే యువకుడికి తెలియజేశాడు. దీంతో చంద్రశేఖర్ బాధితుడిని వాసవీ సత్రం సమీపంలోకి పిలిపించాడు. చంద్రశేఖర్ పాటు మరో అయిదుగురితో కలిసి ప్రసన్న కుమార్‌పై తీవ్రస్థాయిలో దాడి చేశారు. దాడికి పాల్పడిన ఆరుగురుపై బైండోవర్ కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.