దళితునిపై అసభ్యకరంగా ప్రవర్తించిన డీఎస్పీ - చర్యలు తీసుకోవాలని నాయకుల ఆందోళన - Dalit Unions leaders
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 3:48 PM IST
Dalit Unions Agitation in Tuntur District : దళితుల ఆత్మగౌరవ పోరాట సంఘం అధ్యక్షుడు గర్నెపూడి సుధాకర్‌పై గుంటూరు పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. సుధాకర్ కారుని అడ్డుకుని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ డీఎస్పీ వీవీ నాయుడు దుర్భాషలాడారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వీవీ నాయుడికి వ్యతిరేకంగా గుంటూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ, దళితులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ట్రాఫిక్ డీఎస్పీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అతనిపై ఎస్సీ, ఎస్డీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
దళితులంటే ఇంత చిన్న చూపు ఉన్న ఇలాంటి అధికారులపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులకు ఆత్మగౌరవాలు ఉండవా? వారు మనుషులు కారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ఉండి కూడా దళితులను అణిచివేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.