పది రోజుల్లో ఇది రెండోసారి - కూకట్‌పల్లిలో కుంగిన రోడ్డు - Crooked Road
🎬 Watch Now: Feature Video
Published : Mar 1, 2024, 7:29 PM IST
Crooked Road in Kukatpally at Hyderabad : హైదరాబాద్ మహానగరంలో రోడ్లు కుంగడం సర్వసాధారణం అయిపోయింది. తాజాగా నిర్మాణంలో ఉన్న రోడ్డు కుంగిన సంఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో హైదర్‌నగర్ డివిజన్ గౌతమి నగర్లో జరిగింది. ఈ గౌతమి నగర్ వద్ద ప్రణీత్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణం చేపడుతుంది. రోడ్డు పక్కనే నిర్మాణం కోసం పెద్ద గుంత తవ్వడంతో రోడ్డు కుంగిపోయింది. పది రోజుల క్రితం సైతం ఇదే విధంగా రోడ్డు కుంగటంతో తాత్కాలిక మరమ్మత్తులను నిర్మాణ సంస్థ చేపట్టింది. ఇవాళ మరోసారి కుంగింది. ఇలా పదే పదే రోడ్డు కుంగుతుండటంతో గౌతమి నగర్ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Crooked Road at Hyderabad : సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుకుంటున్నారు. రోడ్డు కుంగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి రోడ్డు కుంగిపోయే ఘటనలు తరుచూ జరగడంతో స్థానికులు ఎప్పుడు ఏ రోడ్డు కూలిపోతుందోనని భయాందోళనలో ఉన్నారు.