నాగార్జున సాగర్ డ్యామ్​ వద్ద సేదతీరుతున్న మొసలి - సోషల్​ మీడియాలో వీడియో వైరల్ - crocodile at nagarjuna sagar dam - CROCODILE AT NAGARJUNA SAGAR DAM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 1:38 PM IST

Crocodile at Nagarjuna Sagar Dam : రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన తటాకాలు, డ్యామ్​లు ప్రస్తుతం నిండుకుండలను తలపిస్తున్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొన్నిసార్లు అందులోని మొసళ్లు ఒడ్డుకు చేరి సేద తీరుతున్నాయి. నాగార్జున సాగర్ డ్యామ్​ వద్ద భద్రతా సిబ్బందికి ఇలాంటి దృశ్యమే కనిపించింది.

నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుతం నిండుకుండలా మారింది. దీంతో వరద ప్రవాహానికి మొసళ్లు ఒడ్డుకు చేరుతున్నాయి. ప్రధాన డ్యామ్ వద్ద ఉన్న రాతి కట్టడంపై ఓ మొసలి సేద తీరుతూ కనిపించింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది, మొసలి సేద తీరుతున్న దృశ్యాలను సెల్​ఫోన్​లో చిత్రించారు. దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్​గా మారింది. గతంలో భారీ వర్షాలకు నాగార్జున సాగర్ పూర్తిగా నిండటంతో గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలారు. ఆ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.