నెల్లూరులో క్రికెట్ మ్యాచ్‌లో వివాదం- కడప నుంచి పిలిపించి దాడి - Cricket Match Dispute - CRICKET MATCH DISPUTE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 5:05 PM IST
Cricket Match Dispute Between Youths in Nellore District : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరంలో క్రికెట్ ఆటలో ఇద్దరు యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదంలో ఓ యువకుడి చేతికి గాయమైంది. దీంతో ఆ యువకుడి సోదరుడు భార్గవ్ సాయి కడప జిల్లా బద్వేల్ నుంచి సుమారు 30 యువకులను తీసుకొచ్చారు. తన సోదరుడు చేతికి గాయం చేసిన కార్తీక్ అనే యువకుడు ఇంట్లోకి చొరబడి కర్రలతో వారి కుటుంబ సభ్యులపై దాడి చేశారు.
Attack with Sticks in Tikkavaram Village : ఈ దాడిలో కార్తీక్‌తో పాటు మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్తీక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో దళితవాడకు చెందిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్రికెట్ మ్యాచ్‌లో జరిగిన వివాదంలో ఇంటి వద్దకు వచ్చి దాడి చేయడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.