విజయవాడలో క్రెడాయ్ సదస్సు- సీఎం హాజరు కానుండటంతో ప్రతినిధుల్లో ఆసక్తి - CREDAI Southcon 2024 - CREDAI SOUTHCON 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 9:08 PM IST
CREDAI Southcon 2024 : విజయవాడ నగర శివారులోని కంకిపాడు వద్ద సౌత్‌కాన్-2024 పేరిట సదస్సు నిర్వహిస్తున్నట్లు కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోయేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) ప్రకటించింది. ఈనెల 24, 25 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు స్థిరాస్తి రంగ ప్రముఖులు, సాంకేతికరంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకుల అధికారులు పాల్గొంటారని పేర్కొంది.
ఐక్యత, మెరుగుదల, మార్పు నినాదాలతో దక్షిణ భారతదేశంలోని ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే స్థిరాస్తి రంగంలో పరస్పర సహకారం, నూతన ఆవిష్కరణలు, స్థిరమైన వృద్ధిని పెంపొదించుకోవడం లక్ష్యంగా నిర్దేశించినట్లు చెప్పారు. జాతీయ జీడీపీకి దక్షిణాది రాష్ట్రాలు అధిక తలసరి ఆదాయంతో 31 శాతం సహకారం అందిస్తున్నాయని, ఈ రాష్ట్రాలు దేశంలో సాంకేతికత, ఆటోమొబైల్, ఆరోగ్యం, అంకుర సంస్థల విప్లవంలో ముందుంజలో ఉన్నాయన్నారు.
వీటి ద్వారా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నందున, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించే క్రమంలో సౌత్‌కాన్ 2024లో దక్షిణాదిలో నిర్మాణ రంగం, ప్రస్తుత మార్కెట్ స్థితిగతులు, ఇతర రంగాల అభివృద్ధి అవకాశాలపై జేఎల్ఎల్ సంస్థ రూపొందించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తారన్నారు. అమరావతి రాజధాని ఏర్పాటుతో రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్న క్రెడాయ్, స్థిరమైన నగరాన్ని నిర్మించడానికి తాము విలులైన సలహాలు అందిస్తామన్నారు.