LIVE : తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ - Telangana Incharge Governor 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 20, 2024, 11:20 AM IST
|Updated : Mar 20, 2024, 11:29 AM IST
Governor CP Radhakrishnan Live : తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. 1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ ఛైర్మన్‌గా సేవలందించారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. తనకు తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు అప్పగించినందుకు సీపీ రాధాకృష్ణన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు.
Last Updated : Mar 20, 2024, 11:29 AM IST