మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ఆస్తులను జప్తు చేసిన కోర్టు సిబ్బంది - Court Staff Seized RDO Office
🎬 Watch Now: Feature Video
Published : Mar 20, 2024, 10:09 PM IST
Court Seized RDO Office Property in Mancherial : మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ఆస్తులను సబ్ కోర్టు జడ్జీ ఆదేశాలతో కోర్టు సిబ్బంది జప్తు చేసింది. 1982వ సంవత్సరంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో మల్బరీ పరిశ్రమ కోసం, అదే గ్రామానికి చెందిన మహమ్మద్ నసీరుద్దీన్ నుంచి ఐటీడీఏ(ITDA) వాళ్లు 23 ఎకరాల 27 సెండ్ల భూమిని సేకరించారు. కానీ ఇప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో భూ యజమాని కోర్టును ఆశ్రయించారు.
RDO Office Property Confiscated By Court Staff : 42 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత భూ యజమానికి రెండు కోట్ల 94 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. మూడు నెలల లోపు మెుత్తం చెల్లించకపోతే, ఆర్డీవో కార్యాలయానికి జప్తు చేస్తామని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో కోర్డు ఆదేశాలను ఆర్డీవో కార్యాలయం పట్టించుకోలేదు. దీంతో ఇవాళ కోర్టు సిబ్బంది మంచిర్యాల ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆస్తులను సీజ్ చేశారు.