రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కౌన్సిలర్‌ను బెదిరించిన పోలీసులు - ఎంపీ రాజీనామాకు మద్దతుగా కౌన్సిలర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 9:58 AM IST
Councilor Husband Arrested By Police For Supporting MP: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులకు మద్దతుగా వైసీపీకు రాజీనామా చేసిన కౌన్సిలర్ భర్త నీలం రాజును పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆయనకు మద్దతుగా గురజాల 12వ వార్డు కౌన్సిలర్ నీలం అనిత, ఆమె భర్త నీలం రాజు వైసీపీను వీడారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు రాజు కుటుంబీకులు తెలిపారు. కౌన్సిలర్ భర్తతో నీ భార్య రాజీనామా వెనక్కు తీసుకొని వైసీపీలోనే ఉండాలని పోలీసులు బెదిరించినట్లు పేర్కొన్నారు. మేము చెప్పింది వినకపోతే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి భార్య మాట్లాడుతూ తమకు సమాచారం ఇవ్వకుండా తన భర్తను అన్యాయంగా పోలీసులు తీసుకుపోయారని వెల్లడించారు. ఈ విషయంపై పిడుగురాళ్ల ఎస్సై సమీర్ బాషా మాట్లాడుతూ తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.
ప్రస్తుతం బుధవారం రాత్రి నరసరావుపేట పార్లమెంటు ఇన్ఛార్జిగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను వైసీపీ అధిష్ఠానం నియమించింది. నరసరావుపేట నుంచి పోటీ చేసిన శ్రీకృష్ణదేవరాయులు పార్టీకి రాజీనామా చేయటంతో వైసీపీ అధిష్ఠానం అనిల్ కుమార్ యాదవ్‌ను నియమించినట్లు తెలిపారు. నరసరావుపేట పార్లమెంటు స్థానానికి మరోసారి స్థానికేతరుడికే అధిష్ఠానం బాధ్యతలు అప్పజేప్పింది