నగరాభివృద్ధి ప్రజలకు తెలిసే విధంగా డాక్యుమెంటరీ: మేయర్ విజయలక్ష్మి - council meeting in Vizianagaram

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 8:00 PM IST

Corporation Council Meeting in Vizianagaram : అందరి సహకారంతో నగరాభివృద్ధికి మరింతగా కృషి చేస్తున్నామని విజయనగరం మేయర్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. 11 అంశాలతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో తొలుత నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ మల్లయ్య నాయుడు, సహాయ కమిషనర్ తిరుమలరావు పరిచయం చేసుకున్నారు. అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని కమిషనర్, సహాయ కమిషనర్ వెల్లడించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవంతో మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. 

అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, గతంలో కంటే విజయనగరం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. మిగిలిన పనులను పూర్తి చేసి మరింత అభివృద్ధి దిశగా పని చేస్తామని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సూచనలు, సలహాలతో నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతున్నాయన్నారు. అంబేద్కర్ భవనాన్ని రూ. 39 లక్షల 90 వేల రూపాయల వ్యయంతో నిర్మించుటకు సభ్యులు ఆమోదం తెలపడం ఆనందంగా ఉందన్నారు. నగరాభివృద్ధిని ప్రజలందరికీ మరింత స్పష్టంగా తెలిపే విధంగా డ్రోన్ షూటింగ్​తో డాక్యుమెంటరీ రూపొందించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.