ఒప్పంద కార్మికుల వినూత్న నిరసన - మండే ఎండలో పొర్లు దండాలు - Contract Workers ProtestTirupati
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 3:17 PM IST
Contract Workers Protest at Venkateswara Agricultural College in Tirupati District : తిరుపతి జిల్లా శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఒప్పంద కార్మికులు ఆందోళన బాట పట్టారు. కనీస వేతనం పెంచాలని కోరుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఒప్పంద కార్మికులు మండే ఎండలో నడి రోడ్డుపై పొర్లు దండాలు పెడుతూ గోవిందా గోవిందా అని నినాదాలు చేశారు.
శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఒప్పంద కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న వారు కనీస వేతనం పెంచాలని గత ఏడు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఒప్పంద కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం పెంచే విషయంలో చర్చల పేరుతో కళాశాల యాజమాన్యం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఇటు కళాశాల యాజమాన్యం, అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.