శ్రీకాకుళంలో భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ - పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వడంపై హర్షం - CONSTRUCTION WORKERS RALLY - CONSTRUCTION WORKERS RALLY
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 9, 2024, 5:55 PM IST
Construction Workers Rally About Government New Sand Policy : ప్రభుత్వ నూతన ఇసుక విధానంపై హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళంలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి నుంచి మొదలుపెట్టి అరసవల్లి కూడలి వరకు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ ర్యాలీలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇసుకను వ్యాపారంగా మార్చి దోచుకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజులకే పేదలకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టారని కార్మికులు కొనియాడారు.
బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన ఇసుక విధానం ఎంతో మేలు చేకూరుతుందని కార్మికులు అన్నారు. ఈ ఉచిత ఇసుక విధానాన్ని 2014, 2019లో కూడా అమలు చేశామని ఎమ్మెల్యే అన్నారు. అప్పట్లో ఎంతో మంది నిరుపేదలు ఇళ్లు కట్టుకోగా భవన నిర్మాణ రంగం పుంజుకొని ఎంతో మందికి ఉపాధి కలిగిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు.