జగన్ సభకు డబ్బులు, బిర్యానీ ఇచ్చి జనాన్ని తరలిస్తున్నారు - అవి ప్రభుత్వ సభలా? లేక పార్టీ సభలా? : రఘువీరారెడ్డి - Congress Meeting anantapuram
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 5:46 PM IST
Congress Party Public Meeting in Anantapur District : బీజేపీ, వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కుమ్మకై రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ నాలుగు పార్టీలు ముంచేశాయని మండిపడ్డారు. ఈ నెల ఫిబ్రవరి 26న అనంతపురం వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని స్పష్టం చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలిసి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఏర్టాటు చేసే భారీ సభకు ఏఐసీసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున కార్గే, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరవుతారని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఏ విధంగా న్యాయం చేస్తామన్నది ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టంగా వెల్లడిస్తాం. అదేవిధంగా కొద్దిరోజుల్లో రాజధాని, పోలవరం, విశాఖ ఉక్కు కోసం భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. సీఎం జగన్ సిద్దం సభకు డబ్బులు, బిర్యానీ ఇచ్చి జనాన్ని తరలించారు. అది ప్రభుత్వ సభనా? లేక పార్టీ సభనా? అర్థం కావడం లేదని మండిపడ్డారు.అలాగే రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను రఘువీరా రెడ్డి తీవ్రంగా ఖండించారు.