సిద్ధం సభలో ఈ నాలుగు ప్రశ్నలకు జగన్ సమాదానం చెప్పగలడా? - ysrcp Raptadu Siddam Sabha
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 4:27 PM IST
Congress leader Raghuveera Reddy: ఉమ్మడి అనంతపురం జిల్లా కోసం సీఎం జగన్ ఏం చేశాడో చెప్పడానికి సిద్దమా అని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సవాల్ విసిరారు. రేపు రాప్తాడులో జరిగే సిద్ధం సభలో, పరిష్కృతం కానీ నాలుగు సమస్యలకు సీఎం జగన్ సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్టు, నిర్మాణం నోచుకోని ఉక్కు కర్మాగారం, ప్రాజెక్ట్ అనంత, ఏపీఐఐసీ భూముల్లో నెలకొల్పని పరిశ్రమలు. ఈ నాలుగు అంశాలపై రాప్తాడులో జరగబోయే సిద్ధం సభలో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని గతంలో రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారని తెలిపారు. గతంలో రాహుల్ గాంధీని పీఎం చేయాలంటూ జగన్ మాట్లాడిన వీడియోను రఘువీరా విడుదల చేశారు.
పెద్దిరెడ్డి ఆరోపణలపై స్పందించిన రఘువీరా: తనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆరోపణలను రఘువీరా ఖండించారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు లారీలో ఏదైనా తరలించి ఉంటే, ఆ లారీలు మీవే అని ఎద్దేవా చేశారు. అందుకు మీరే సాక్షులుగా ఉంటారని వ్యంగంగా మాట్లాడారు. తాను అవినీతికి పాల్పడి ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలని రఘువీరారెడ్డి హితవు పలికారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని చంపాలని చూసినా మేము బతికించుకునే ప్రయత్నాలు చేస్తున్నే ఉంటామని రఘువీర తెలిపారు.