బీజేపీలో పదవులు అడిగితే ఉన్న పదవి పోతుంది : జగ్గారెడ్డి - Jagga Reddy Comments on BJP - JAGGA REDDY COMMENTS ON BJP
🎬 Watch Now: Feature Video


Published : May 27, 2024, 8:23 PM IST
Jagga Reddy Interesting Comments on BJP : కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధికి దోహదం చేసే పరిశ్రమలు పెడుతూ వస్తే, బీజేపీ వాటిని అమ్ముకుంటూ వస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఈ పదేళ్లలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారని ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని అన్నారు. బీజేపీలో పదవులు అడిగితే ఉన్న పదవి కూడా పోతుందని ఎద్దేవా చేశారు.
Jagga Reddy Fire on BRS : బీఆర్ఎస్ పార్టీలో అధ్యక్ష పదవి కావాలని ఎవరు అడిగేంత ధైర్యం చేయరని, అడిగినా మార్చడం సాధ్యం కాదని జగ్గారెడ్డి ఆరోపించారు. దేశంలో ప్రాజెక్టులు నిర్మించి, వ్యవసాయభివృద్ధికి దోహదం చేసింది, విద్యుత్తు ఉత్పత్తిని పెంచిందెవరని ప్రశ్నించారు. భవిష్యత్ గురించి ఆలోచించి గతంలో ఎఫ్‌సీఐని ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు నిల్వ ఉంచుకునేందుకు ముందు చూపుతో నెహ్రు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆస్తులను పెంచితే బీజేపీ వాటిని ధారాదత్తం చేస్తూ వస్తోందని విమర్శించారు.