వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలి: తులసి రెడ్డి - Congress leader Tulasi Reddy demand
🎬 Watch Now: Feature Video
Congress leader Tulasi Reddy demand: వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ దిశగా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. గతంలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప అని, అందువలన జిల్లాకు ఆ పేరు వచ్చిందని పేర్కొన్నారు. 1808 వ సంవత్సరంలో కడప జిల్లా ఏర్పడిందని పేర్కొన్నారు. 2010 సంవత్సరం వరకు కడప జిల్లా పేరుతోనే పిలిచామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం వైఎస్సార్ జిల్లా అని పేరు మార్చారని గుర్తుచేశారు. వేంకటేశ్వర స్వామి గుర్తుతో పాటుగా రాజశేఖర్ రెడ్డి గుర్తుగా వైఎస్సార్ కడప జిల్లా అని పెరుపెడితే సమంజసంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తనతో పాటుగా అనేకమంది జిల్లా ప్రజలు అప్పుడే ప్రభుత్వానికి సూచించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా ఈ విషయమై అన్ని కోణాలలో ఆలోచించి వైఎస్సార్ కడప జిల్లా అని పేరు మార్చాలని డిమాండ్ చేశారు.