ఓట్ల కోసం వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను నిలదీయండి: రవిశంకర్ - Communist Party Secretary on ycp - COMMUNIST PARTY SECRETARY ON YCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 5:17 PM IST
Communist Party State Secretary Ravi Shankar Fired on YSRCP Gov: కడప ఉక్కు కర్మాగారం నిర్మించని వైఎస్సార్సీపీ నేతలకు ఓటు అడిగే హక్కు లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ అన్నారు. అధికార పార్టీ ఉక్కు కర్మాగారం (Steel Plant) పూర్తి చేయనందుకు కడప ప్రజలకు క్షమాపణ చెప్పాలని రవిశంకర్ తెలిపారు. ఐదేళ్లుగా ఉక్కు కర్మాగారం నిర్మించకుండా నిర్లక్ష్యం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష తక్షణమే రాజీనామా చేయాలని రవిశంకర్ డిమాండ్ చేశారు.
Ravi Shankar Support to Sunitha about YS Viveka Death Case: ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను రాయలసీమకు ఏం చేశారని ప్రజలు నిలదీయాలని రవిశంకర్ తెలిపారు. వివేకా హత్య కేసులో వెలువడుతున్న పరిణామాలు, ఆధారాలు దృష్ట్యా సునీతకే మద్దతు ఇస్తున్నామని రవిశంకర్ తెలిపారు. వివేకా హత్య కేసుకు సీఎం జగన్, అవినాష్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు.