'రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలెవరూ వెళ్లొద్దు'- చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ - People Alert Beware of leopard
🎬 Watch Now: Feature Video
Collector Rajkumari Advised To People Be Alert For Leopard : రాష్ట్రంలోని అటవీ సరిహద్దు ప్రాంతాలలో పులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నంద్యాల జిల్లా మహానంది పరిసర ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు వెదురు కర్రల సేకరణకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
మంగళవారం గిరిజన యువకుడిపై దాడి చేసింది చిరుతనా లేక ఇతర జంతువునా అన్న విషయాన్ని ఫారెస్ట్ అధికారులు వెల్లడించాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని రాజకుమారి సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుత పులి జనవాసల్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.