LIVE : నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - ప్రత్యక్షప్రసారం - CM REVANTH NALGONDA TOUR LIVE
🎬 Watch Now: Feature Video
Published : Dec 7, 2024, 3:24 PM IST
|Updated : Dec 7, 2024, 5:05 PM IST
CM Revanth Reddy Nalgonda Tour : నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దామరచర్ల చేరుకుని యాదాద్రి థర్మల్ ప్లాంట్ రెండో దశను ప్రారంభించారు. అనంతరం థర్మల్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. బ్రహ్మణ వెల్లెంలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి రిజర్వాయర్ ద్వారా నీటిని చేయనున్నారు. అలాగే సాయంత్రం నల్గొండకు చేరుకుని వైద్య కళాశాల ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన వారికి సీఎం రేవంత్ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసు శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు, దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్, జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో హెలిప్యాడ్, వైద్య కళాశాల సమీపంలోని సభా ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ, డీఐజీ, ఐదుగురు ఎస్పీలు సహా 2,500 మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు.
Last Updated : Dec 7, 2024, 5:05 PM IST