LIVE : కరీంనగర్​ జిల్లా జమ్మికుంట జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - CM Revanth Election Campaign - CM REVANTH ELECTION CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 4:20 PM IST

Updated : Apr 30, 2024, 4:46 PM IST

CM Revanth Reddy At Huzurabad Jana Jatara Sabha Live : రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, మెజారిటీ లోక్​సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో, ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు హుజూరాబాద్ జన జాతర సభకు హాజరయ్యారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు అలాగే రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ సమావేశాలల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ సమావేశాలల్లో హాజరవుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.  
Last Updated : Apr 30, 2024, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.