నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు
🎬 Watch Now: Feature Video
CM Jagan handed over B form to ysrcp Rajya Sabha candidates: వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు శాసనసభ కార్యదర్శి వద్ద నామినేషన్ పత్రాలను సమర్పించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కలిశారు. అనంతరం సీఎం జగన్ వారికి రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేశారు. రాజ్య సభ ఎంపీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
ముగ్గురూ గెలిచేనా?: ఎమ్మెల్యేల మార్పులతో వైఎస్సార్సీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న పలువురు నేతలు ఇప్పటికే ఆ పార్టీని వీడారు. మరి కొందరు ఆ పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా రాజ్యసభ నోటిఫికెషన్ వెలువడిన నేపథ్యంలో, రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకోవడం వైసీపీకి కత్తిమీద సాములా మారింది. అసలే తమకు టికెట్లు రాలేదని పార్టీ నిర్ణయంపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే సీఎం జగన్ పిలిచినా రావడం లేదు. ఈ తరుణంలో రాజ్యసభలో ఖాళీ అయిన మూడు స్థానాలను వైఎస్సార్సీపీ పెద్దలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా ఆ మూడు సీట్లను దక్కించుకోవాలని అనుకుంటున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుతో పాటు మేడా రఘునాథరెడ్డికి నేడు సీఎం జగన్ వైఎస్సార్సీపీ నుంచి బీ- ఫారం ఇచ్చారు. తొలుత చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులను ఎంపిక చేసి, తరువాత ఆయనను తప్పించి మేడా రఘునాథరెడ్డికి అవకాశం ఇచ్చారు.