వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లన్నీ మాకే- ఏలూరు దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్ - వైఎస్సార్సీపీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2024/640-480-20659449-thumbnail-16x9-cm-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 8:23 PM IST
CM Jagan criticized opposition allegations: వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై విపక్షాలు దాడులు చేస్తున్నాయని సీఎం జగన్ విమర్శించారు. చరిత్రలో ఎక్కడా చూడని సామాజిక న్యాయం జగన్ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఎమ్మెల్యే, 25 కి 25 ఎంపీ సీట్లు గెలుస్తామని తిరుగులేని విశ్వాసంతో ఉన్నామన్నారు. పేద వర్గాల సంక్షేమం, అభివృద్ధి పట్ల త్రికరణ శుద్ధిగా నిబద్ధత చూపింది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని ఉద్ఘాటించారు.
వచ్చే ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకోవడానికి మాత్రమే కాదని, పేదల సంక్షేమం, పిల్లల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటా చేరవేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీకి స్టార్ క్యాంపెయినర్స్గా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి అభిమాని కాలర్ ఎగరేసుకునే విధంగా, సీట్లు గెలవాల్సిన అవసంరం ఉందని తెలిపారు. గతంలో తెలుగుదేశం విడుదల చేసిన మ్యానిఫెస్టో పూర్తిగా అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.