సీఎం జగన్​ మాదిగలకు తీరని ద్రోహం చేశారు: ఎంఆర్పీఎస్​ నేత ఎలీషా - Jagan Betrayed has MRPS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 4:35 PM IST

CM Jagan Betrayed has Madiga Rakshana Porata Samithi: సామాజిక న్యాయం చేస్తున్నామంటూ సీఎం జగన్​ మాదిగలకు తీరని ద్రోహం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మండిపడ్డారు. గుంటూరులో మార్చి 29న జరగాల్సిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభను జగన్ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. త్వరలోనే ఎంఆర్పీఎస్​ సభను మళ్లీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజయవాడలోని ఎంఆర్పీఎస్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలీషా మాట్లాడారు. ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్​ను పంపకుండా ఎస్సీ వర్గీకరణకు సీఎం జగన్​ తన వ్యతిరేకతను చూపారని ఆయన విమర్శించారు. 

రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ సీట్లు ఉండగా అందులో మాలలకు 19, మాదిగలకు 10 సీట్లు కేటాయించి జగన్మోహన్ రెడ్డి తమకు ద్రోహం చేశారన్నారు. సీఎం జగన్​ వర్గీకరణకు వ్యతిరేకమా, సానుకూలత అనేది చెప్పాలని ఎలీషా డిమాండ్ చేశారు. వర్గీకరణకు అనుకూలంగా ఉన్న ఎన్డీయే కూటమికి రానున్న ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.