LIVE : సచివాలయం సమీపంలో అన్న క్యాంటీన్​- ప్రారంభించిన సీఎం ప్రత్యక్ష ప్రసారం - CM Inaugurate Anna Canteen - CM INAUGURATE ANNA CANTEEN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2024, 7:42 PM IST

Updated : Sep 19, 2024, 8:28 PM IST

CM Inaugurate Anna Canteen Near AP Secretariat Velagapudi Amaravati LIVE : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మరో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తక్కువ ధరకే రుచికరమైన ఆహారం అందుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15న మొదటి విడతలో భాగంగా కూటమి ప్రభుత్వం 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రజలెవరూ పట్టెడన్నం కోసం కష్టాలు పడే పరిస్థితి లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పూటకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ప్రజలు కూడా తమ వంతు సహకారంతో అన్న క్యాంటీన్లు శాశ్వతంగా నడిచేలా విరాళాలివ్వాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు ఏపీ సచివాలయం సమీపంలో అన్నా క్యాంటీన్​ని ప్రారంభిస్తున్నారు. మీ కోసం ఈ ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Sep 19, 2024, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.