దేవాదాయశాఖ అర్చకులకు ఇక నుంచి రూ. 15 వేల వేతనం-సీఎం చంద్రబాబు - CBN Review on Endowments Department - CBN REVIEW ON ENDOWMENTS DEPARTMENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2024, 10:22 PM IST
CM Chandrababu Review With Endowments Department : దేవాదాయశాఖ పరిధిలోని అర్చకులకు వేతనాలు పెరగనున్నాయి. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహా అధికరులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రూ.10 వేలు వేతనం అందుకుంటున్న అర్చకులకు ఇకపై 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు. దూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని 5 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. నిరుద్యోగ వేద విద్యార్ధులకు నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని నిర్ణయించారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా జరిగే పనుల్లో ప్రారంభం కాని వాటిని నిలిపివేయనున్నారు.
భక్తుల మనోభావాలు ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. బలవంతపు మత మార్పిడులు, అన్య మతస్థులు రాకుండా చూడాలని సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటకం ప్రమోషన్ కోసం దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖ మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీల ఏర్పాటు పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. సింహాచలం పంచ గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.