100 రోజుల్లో పదవులన్నీ భర్తీ - 25 రోజుల్లో అందరికీ శుభవార్త: చంద్రబాబు - Chandrababu On nominated Posts - CHANDRABABU ON NOMINATED POSTS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-08-2024/640-480-22320835-thumbnail-16x9-chandrababu-on-nominated-posts.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2024, 9:29 PM IST
Chandrababu On Nominated Posts : మూడు పార్టీలను సమన్వయం చేసుకొని త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. సరైన నాయకుడిని సరైన స్థానంలో నియమించే ప్రక్రియలో నామినేటెడ్ పదవుల భర్తీ కొంచెం ఆలస్యం అవుతోందని తెలిపారు. కసరత్తు పూర్తి కావొచ్చిందని, త్వరలోనే పదవుల నియామకం ఉంటుందని స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపులో మూడు పార్టీలు ఎలా సమన్వయం చేసుకున్నాయో పదవుల పంపకాల్లోనూ అదే తరహా సర్దుబాటు ఉంటుందని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చి 70 రోజులైనా ఇంకా పదవులు భర్తీ కాలేదనే అసంతృప్తి తమ నాయకుల్లో ఉందని చంద్రబాబు అన్నారు. అందరికీ ఉన్న 24 గంటల సమయమే తనకు కూడా ఉందని గ్రహించాలని తెలిపారు. కొందరు ఆశావహుల అంచనాలు భారీగా ఉంటున్నాయని, కానీ అందరినీ సంతృప్తిపరిచేలానే నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. 100 రోజుల్లో పదవులన్నీ భర్తీ చేస్తాం, మరో 25 రోజుల్లో అందరికీ శుభవార్త ఉంటుందని వ్యాఖ్యానించారు.
అందరినీ పార్టీలోకి తీసుకోం : పదవులకు రాజీనామాలు చేసినా, నేతల వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేరికలు ఉంటాయని చంద్రబాబు తేల్చి చెప్పారు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపటం కూడా ప్రమాదమేనని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఇమడలేక ఎవరైనా మావైపు వస్తుంటే పదవులకు, పార్టీకి రాజీనామా చేస్తేనే తీసుకుంటామని స్పష్టం చేసారు. రాజీనామా చేసి వస్తే వారిని తీసుకుంటామన్నారు. కొందరి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపటం కూడా ప్రమాదమేనని వ్యాఖ్యానించారు.