CM Chandrababu LIVE: మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం - ప్రత్యక్షప్రసారం - CBN met Medtech staff
🎬 Watch Now: Feature Video
CBN met Medtech staff: విశాఖలో మెడ్‌టెక్ జోన్ సిబ్బందితో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తున్నారు. అంతకుముందు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను సీఎం పరిశీలించారు. విహంగ వీక్షణం ద్వారా ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైఎస్సార్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తాను అంగీకరించినట్లు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విషప్రచారాలు నమ్మొద్దని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్ర ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేస్తే అనకాపల్లిలో 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని టెండర్లు పిలిచి వీలైనంత తొందరగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తిచేస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మెడ్‌టెక్ జోన్ సిబ్బందితో సీఎం చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొన్నారు. ప్రత్యక్షప్రసారం
Last Updated : Jul 11, 2024, 5:57 PM IST