అప్పుడూ ఇప్పుడూ బస్సులోనే - ప్రజల కోసం జీవితం అంకితం: చంద్రబాబు - CM Chandrababu on Skill Case Arrest - CM CHANDRABABU ON SKILL CASE ARREST
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 9, 2024, 8:01 PM IST
CM Chandrababu on Skill Case Arrest: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను గతంలో అరెస్టు చేసిన విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గత ఏడాది ఇదే రోజు ఏ ఆధారం లేకుండా అక్రమ కేసులో తనను అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ రోజు ప్రజలంతా తన వెంట నిలిచారని గుర్తు చేసుకున్నారు. తన పట్ల అంత ఆదరణ చూపిన ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి పని చేస్తానని స్పష్టం చేశారు.
తనను అరెస్టు చేసినప్పుడు ప్రపంచవ్యాప‌్తంగా ప్రజలంతా తన వెంటే నిలిచారని అన్నారు. తన కోసం నిలబడిన ప్రజల కోసం జీవితాంతం కష్టపడి పని చేస్తానని తెలిపారు. తనను ఏ పేరుతో పిలిచినా పలుకుతూ, వారి మధ్యే ఉండి పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు ప్రజలకు కష్టం వస్తే తానూ వారి మధ్య ఉన్నానని, గత సంవత్సరం ఇదే రోజు బస్సులోనే ఉన్నా, ఈ రోజూ బస్సులోనే ఉన్నానని చెప్పారు.