సోషల్ మీడియాలో టీడీపీ-వైసీపీ వార్ - రాళ్ల దాడి - టీడీపీ వైసీపీ ఘర్షణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 5:04 PM IST
Clash Between TDP and YSRCP Activists: వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం కొండ సుంకేసులలో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ, ఇద్దరు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ రెడ్డి (TDP Incharge Bhupesh Reddy) ఆదివారం గ్రామంలో పర్యటించి కొన్ని కుటుంబాలను పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించిన కొన్ని నిధులు దారి మళ్లాయని ఆ సమయంలో విమర్శించారు. సోమవారం సోషల్ మీడియా (Social Media)ను వేదికగా చేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు.
సామాజిక మాధ్యమంలో చర్చ తారస్థాయికి చేరడంతో గ్రామంలోని చావిడి వద్ద ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వైసీపీ కార్యకర్తలు ఇద్దరినీ జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి (Jammalamadugu Govt Hospital)కి తరలించగా, టీడీపీ కార్యకర్తలిద్దరినీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆసుపత్రి (Allagadda Hospital)కి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కొండ సుంకేసుల గ్రామంలో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.