ఈసీ ఆదేశాలను జగన్‌ లెక్క చేయడం లేదు- ఎన్నికలను వ్యాపారమయం చేశారు : వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి - సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 5:21 PM IST

Citizens for Democracy Kalajatha: వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినా సీఎం జగన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి (Vallamreddy Lakshman Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లే తన సైన్యం అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదే పదే బహిరంగ సభల్లో చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏలూరు సర్ సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళాజాత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

'ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' అనే నినాదంతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కళాజాతలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున కళా బృందం ఓటు ఆవశ్యకత, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే కలిగే నష్టాలను ఆటలు, పాటలు, నాటికల ద్వారా ప్రదర్శనల రూపంలో విద్యార్థుల ముందుంచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా, ఎన్నికలను వ్యాపారంగా మార్చిందని లక్ష్మణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, సమాజాన్ని జాగృతం చేసే దిశగా కళాజాత ద్వారా ప్రదర్శనలు ఇస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.